పుణ్యస్నానాలు.. మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతర అధికారికంగా ముగిసి మూడు రోజులు గడిచినా మేడారానికి భక్తులు వస్తూనే ఉన్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు చేశారు. ఈ క్రమంలో గద్దెల వద్ద పేరుకుపోయిన కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని దేవాదాయశాఖ సిబ్బంది తొలగిస్తున్నారు.


