యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
● లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్
వెంకటాపురం(ఎం): యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, పొగాకు, గుట్కా, సిగరెట్లు, గంజాయి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్‌డేను పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాధి నుంచి బయట పడవచ్చని తెలిపారు. ఆరోగ్య వంతమైన ఆహారపు అలవాట్లు, ప్రతిరోజూ వ్యాయాయం చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, మెడికల్ ఆఫీసర్ రిషిత, సంఘమిత్ర, ఏఎన్‌ఎంలు శోభ, విజయ తదితరులు పాల్గొన్నారు.


