కలిసిరాని కాలం | - | Sakshi
Sakshi News home page

కలిసిరాని కాలం

Dec 29 2025 8:49 AM | Updated on Dec 29 2025 8:49 AM

కలిసి

కలిసిరాని కాలం

– 8లోu

సాగు హుషారు..

‘మోంథా’తో బేజారు!

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

మ్మడి వరంగల్‌లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ, కందులు తదితర పంటలను విరివిగా పండిస్తారు. ప్రభుత్వం ఆధునికీకరణ, సాగునీటి సౌకర్యాల కల్పన, రైతులకు సాంకేతిక సాయం అందిస్తూ పంటల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. అయితే, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తరచూ నష్టపోతున్నారు. సాగు సమయంలో వర్షాలు.. గోదావరి జలాల కోసం ఎదురుచూశారు. వానాకాలం, యాసంగిలో ఎరువుల కొరత వెంటాడింది. రోజుల తరబడి ఎరువుల దుకాణాల ఎదుట ‘క్యూ’ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు చేతికందే సమయంలో ‘మోంథా’ తుపాను కాటేసింది. పంటలు వేసే సమయంలో భరోసా దొరకని రైతులకు దెబ్బతిన్న పంటలపై ధీ(బీ)మా దొరకలేదు. కాస్త చేతికందిన పంటలకు మార్కెట్‌లో ‘మద్దతు’ దొరకలేదు. ఫలితంగా 2025లో రైతులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

ఎరువుల కోసం తండ్లాట!

సాగు సమయంలో పంటలకు సరిపడా ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు లభించక రైతులు రోజుల తరబడి దుకాణాల చుట్టూ ఎరువుల కోసం తిరిగారు. ఎన్నో ఇబ్బందులు పడి ఎరువులు దక్కించుకుని తెగుళ్లు, కలుపు భారం నుంచి బయటపడ్డ రైతులను పంట చేతికందే సమయంలో ‘మోంథా’ ముంచేసింది. కల్లాలకు తరలించిన ధాన్యం కొట్టుకుపోయింది. ఇలా మొత్తం ఉమ్మడి జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, వారికి ఎలాంటి బీమా దక్కకపోగా, ఆ మేరకు పరిహారం అందలేదని పలు సందర్భాల్లో రైతులు వెల్లడించారు.

రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు..

రైతులు సాంకేతికతను, మార్కెట్‌ పోకడలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నేల ఆరోగ్యం, సమీకృత వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, సేంద్రియ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్‌ న్యూట్రియంట్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి పథకాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్‌ రీజినల్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (ఆర్‌ఎఆర్‌ఎస్‌) కొత్త వరి వంగడాలను (ఉదాహరణకు, వరంగల్‌–1119 వంటివి) విడుదల చేసింది. ఇవి స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే సన్న, దొడ్డు గింజ రకాలను రైతులకు అందుబాటులో ఉంచారు. హార్టికల్చర్‌ ద్వారా హైబ్రిడ్‌ కూరగాయల విత్తన సబ్సిడీలు, పర్మనెంట్‌ పాండల్స్‌, మల్చింగ్‌ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు.

జూలై వరకు లోటు వర్షపాతమే...

ఉమ్మడి వరంగల్‌లో జూలై మాసాంతం నాటికి 52 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. 23 మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో 75 మండలాలకు ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మిల్లీమీటర్లకు 662.10 మిల్లీమీటర్లు (66 శాతం) అధికంగా కురిసింది. 25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురవగా, 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ములుగు, జేఎస్‌ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లినా ఆ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు.

తగ్గిన పప్పుధాన్యాల సాగు

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా పప్పు దినుసుల సాగు గణనీయంగా తగ్గింది. గతేడాది 49,876 ఎకరాల్లో పెసర, కంది, వేరుశనగ తదితర పంటలు వేశారు. ఈసారి వానాకాలంలో 31 వేల ఎకరాలకు తగ్గినట్లు అధికారుల గణాంకాలు వెల్లడించాయి. అలాగే, సన్‌ఫ్లవర్‌, గ్రౌండ్‌ నట్‌, ఆముదం తదితర ఆయిల్‌ సీడ్స్‌ పంటలు 19,210 ఎకరాల నుంచి 5,429 ఎకరాలకు పడిపోయినట్లు వ్యవసాయశాఖ రికార్డులు చెబుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాగు ఇలా

(ఎకరాల్లో)..

ములుగు రూరల్‌: చలితీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావుతో నేడు సాక్షి ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్‌లో సంప్రదించాలి.

తేది: 29–12–2025 సోమవారం

సమయం

ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు

ఫోన్‌ చేయాల్సిన నంబర్లు

6281952139, 9989830060

(ఎకరాల్లో)

సాగైంది

8,15

లక్షలు

8,58,376

రైతులను వెంటాడిన

ప్రకృతి వైపరీత్యాలు

తుపానుతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలు

ధీమా ఇవ్వని ‘బీమా’..

ఇంకా చేతికందని పరిహారం

పెరిగిన వాణిజ్య పంటల సాగు...

వరి, పత్తి తర్వాతే పప్పు దినుసులు

రైతులకు తప్పని ఎరువుల కొరత..

వరి, పత్తికి దక్కని మద్దతు ధర

ఒడిదుడుకుల మధ్య సాగిన

వ్యవసాయం

కలిసిరాని కాలం1
1/12

కలిసిరాని కాలం

కలిసిరాని కాలం2
2/12

కలిసిరాని కాలం

కలిసిరాని కాలం3
3/12

కలిసిరాని కాలం

కలిసిరాని కాలం4
4/12

కలిసిరాని కాలం

కలిసిరాని కాలం5
5/12

కలిసిరాని కాలం

కలిసిరాని కాలం6
6/12

కలిసిరాని కాలం

కలిసిరాని కాలం7
7/12

కలిసిరాని కాలం

కలిసిరాని కాలం8
8/12

కలిసిరాని కాలం

కలిసిరాని కాలం9
9/12

కలిసిరాని కాలం

కలిసిరాని కాలం10
10/12

కలిసిరాని కాలం

కలిసిరాని కాలం11
11/12

కలిసిరాని కాలం

కలిసిరాని కాలం12
12/12

కలిసిరాని కాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement