బస్టాండ్ క్యూ లైన్ పనుల్లో నిర్లక్ష్యం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం ఆర్టీసీ బస్టాండ్‌లో భద్రాచలం, కొత్తగూడెం క్యూలైన్ పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జాతర సమయంలో కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లే భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. జాతర సమయం దగ్గరపడుతున్న తరుణంలో క్యూలైన్లపై తడుకల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు నీడ కోసం పలుచటి తడుకలను ఏర్పాటు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి నాణ్యమైన తడుకలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
గట్టమ్మ వద్ద కోలాహలం
ములుగు రూరల్: ఆది దేవత గట్టమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనానికి వచ్చే భక్తులు ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా తరలి వచ్చారు. ముందుగా గట్టమ్మ తల్లికి భక్తులు పసుపు–కుంకుమలు, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఆలయ పరిసరాలలో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద పసుపు, కుంకుమలు సమర్పించారు. దీంతో గట్టమ్మ ఆలయ ప్రాగణం భక్తులతో కిక్కిరిపోయింది. అనంతరం భక్తులు వనదేవతల దర్శనానికి బయలుదేరారు.
జంపన్నవాగులో ఇసుక
బస్తాలతో అడ్డుకట్ట
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జంపన్నవాగులో నీటి లభ్యత కోసం ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇసుక బస్తాలతో అడ్డుకట్ట పనులు చేపట్టారు. మేడారం భక్తులు పుణ్యస్నానాల కోసం గోవిందరావుపేట మండలంలోని లక్నవరం నీటిని విడుదల చేస్తారు. నీటి లభ్యతగా ఉండేలా వాగులో తొమ్మిది ప్రదేశాల్లో బస్తాల్లో ఇసుక నింపి వాగుకు అడ్డుకట్టగా వేస్తున్నారు. నీరు నిల్వ ఉండడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.
ఆటోల్లో
భక్తుల తరలింపు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: అమ్మవార్ల దర్శనం కోసం మేడారానికి ఆదివారం భక్తులు వేలాది తరలివచ్చారు.ఆర్టీసీ బస్టాండ్ నుంచి జంపన్నవాగుకు సుమారుగా మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. జంపన్నవాగుకు భక్తులను తరలించేందుకు యజమానులు, డ్రైవర్లు ఆటోలను బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసుకున్నారు. బస్టాండ్‌లో దిగిన భక్తులు ఆటోలను ఆశ్రయించడంతో స్నానాల కోసం జంపన్నవాగుకు ఆటోలలో తరలించడంతో భక్తులను తరలించారు సాధరణ చార్జీలు తీసుకున్నారు.
బస్టాండ్ క్యూ లైన్ పనుల్లో నిర్లక్ష్యం
బస్టాండ్ క్యూ లైన్ పనుల్లో నిర్లక్ష్యం


