నియామకం
ములుగు రూరల్ : జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా నద్దునూరి రమేశ్‌ను నియమించినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం కాకతీయ యూనివర్శిటీ సెమినార్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం రమేశ్ మా ట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన జా తీయ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జి ల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కాళేశ్వరాలయంలో
భక్తుల ప్రత్యేక పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశుభానందదేవి, సరస్వతి అమ్మవార్ల ఆలయంలో మహిళలు పూ జలు చేశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది.
రూ.30కోట్ల పనులకు ప్రతిపాదనలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ ఏడాది మే లో సరస్వతీ నది పుష్కరాలను 12 రోజుల పాటు రాష్ట్రప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలి సిందే. వచ్చే మే 21 నుంచి 12 రోజులు సరస్వతీ నదికి అంత్యపుష్కరాలకు పండితులు ముహూర్తం ఖరారు చేశారు. రూ.30కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. పుష్కరఘాట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.
నియామకం


