అమ్మవారి సన్నిధిలో మోగ్లీ సినిమా యూనిట్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని సోమవారం మధ్యాహ్నం మోగ్లీ సినిమా కథానాయకుడు రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, చిత్రం యూనిట్ సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా వారు మోగ్లీ సినిమా పెద్ద హిట్ సాధించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ స్నపన మందిరంలో ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు క్రాంతికుమార్, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మోతుకూరి మయూరి, స్రవంతి, అనంతుల శ్రీనివాస్, సిబ్బంది అలుగు కృష్ణ పాల్గొన్నారు.


