జాతరలోగా బస్టాండ్ పనులు పూర్తిచేయాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం/మంగపేట: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులు మేడారం జాతరలోగా పూర్తి చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. నిర్మాణ పను లను నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి చే యాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. జాతర సమయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా 3,500 బస్సులను నడిపిస్తున్నామని తెలిపారు. అందుకు గాను 10 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి విధులు కేటాయించి రూ.20 లక్షల మంది భక్తులకు ఆ ర్టీసీ సేవలు అందించనున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే మేడారం జాతరకు 4 నుంచి 5 లక్షల మంది అదనపు ప్రయాణికులు రవాణా చేసే లా ఏర్పాట్లు పెంచుతామని వెల్లడించారు. నిర్మాణ పనులను అధికారులు పర్యవేక్షింంచాలని సూచించారు. ఆయన వెంట ఆర్టీసీ అధికారులు ఉన్నారు.
మరో నాలుగు నెలల్లో బస్ డిపో పూర్తి
ఏటూరునాగారం: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణం మరో నాలుగు నెలల్లో పూర్తవుతుందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నా రు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్‌డిపోను పరిశీ లించి వివరాల సేకరించారు. రూ.4.99 కోట్ల తో ఆర్టీసీ ఏటూరునాగారం డిపో నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. పనులు త్వరగా పూర్తి చేయించి సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో సిటీ బస్‌స్టేషన్ ఇన్‌చార్జ్ మల్లేషం, అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా మంగపేట మండలంలో ఎంపీడీఓ కార్యాలయం పక్కన నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ పనులను ఎండీ నాగిరెడ్డి పరిశీలించారు. పనులను తనిఖీ చేసి సైట్ ఇన్ చార్జ్‌ను పలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
ఆర్టీసీ వైస్ చైర్మన్,
మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి


