‘ఫేక్‌ వాట్సాప్‌ మెసేజ్‌లు నమ్మకండి’ | - | Sakshi
Sakshi News home page

‘ఫేక్‌ వాట్సాప్‌ మెసేజ్‌లు నమ్మకండి’

Dec 17 2025 6:44 AM | Updated on Dec 17 2025 6:44 AM

‘ఫేక్

‘ఫేక్‌ వాట్సాప్‌ మెసేజ్‌లు నమ్మకండి’

నిట్‌లో వర్క్‌షాప్‌ ప్రారంభం

ములుగు: జిల్లా కలెక్టర్‌ పేరుతో వస్తున్న ఫేక్‌ వాట్సాప్‌ మేసేజ్‌లను నమ్మి మోసపోవద్దని కలెక్టర్‌ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన ఫొటోను ఉపయోగించి డబ్బులు పంపాలని కోరుతూ నకిలీ సందేశాలు పంపిస్తున్న ఘటనలపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తన ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకొని కొందరు దుండగులు వివిధ అధికారులకు, వ్యక్తులకు వాట్సాప్‌ సందేశాలు పంపి డబ్బులు పంపించాలని అడుగుతున్నారని, ఇటువంటి సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని తెలిపారు. ఎలాంటి లావాదేవీలు చేయవద్దని అధికారులకు, ప్రజలకు సూచించారు.కలెక్టర్‌ పేరు, ఫొటో లేదా హోదాను ఉపయోగించి వచ్చే సందేశాలు నకిలీవని, తన తరఫున వ్యక్తిగతంగా గాని, వాట్సాప్‌ ద్వారా గాని డబ్బులు అడగబోనని స్పష్టం చేశారు. ఇలాంటి నకిలీ మెసేజ్‌లు అందిన వెంటనే సంబంధిత వాట్సాప్‌ నంబర్లను బ్లాక్‌ చేయాలని, సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాజీపేట అర్బన్‌: నిట్‌ సెమినార్‌హాల్‌ కాంప్లెక్స్‌లో స్పార్క్‌ (స్కీం ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ అకడమిక్‌ అండ్‌ రీసెర్చ్‌ కొలాబరేషన్‌) సౌజన్యంతో సస్టేనబుల్‌ వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్‌ వర్క్‌షాప్‌ మంగళవారం ప్రారంభమైంది. నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్‌ వర్క్‌షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. నిట్‌ వరంగల్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఎంసీ గిల్‌ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీన్‌ రీసెర్చ్‌ అండ్‌ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్‌ శిరీష్‌ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్‌పూర్‌ పాల్గొన్నారు.

ఎన్నికల సిబ్బందికి

ఆర్టీసీ సేవలు

ములుగు రూరల్‌: పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది సౌకర్యార్థం ములుగు నుంచి హనుమకొండకు ఆర్టీసీ అదనపు ట్రిప్పులు నడిపిస్తున్నట్లు వరంగల్‌–2 డిపో మేనేజర్‌ రవిచందర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 10, 12 గంటలకు, ఒంటి గంటకు సైతం అదనంగా మూడు ట్రిప్పులు నడిపిస్తున్నామని వివరించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు వినియోగించుకోవాలని కోరారు.

బొగ్గుబ్లాక్‌ల వేలానికి

అనుమతి ఇవ్వాలి

భూపాలపల్లి అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌కుమార్‌ మాట్లాడారు. కోలిండియా వ్యాప్తంగా 41బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రభుత్వం వేలంవేసే ప్రక్రియ ప్రారంభించిందన్నారు. అందులో భాగంగా మణుగురు ఏరియాలోని డిప్‌సైట్‌ బొగ్గు బ్లాక్‌ను వేలంలో పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలైన ఆదాని, ఏఎంఆర్‌, మేఘా కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్నారు. ఇప్పటికే ఏడు కంపెనీలు టెండర్‌ఫారాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. సింగరేణి సంస్థ వేలం పాల్గొనేందుకు వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్‌కోకు వేలం వేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. మణుగురు ఓసీని సింగరేణి దక్కించుకోకుంటే మణుగురులో సింగరేణి మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్‌కో వేలంలో పాల్గొనడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.

‘ఫేక్‌ వాట్సాప్‌ మెసేజ్‌లు నమ్మకండి’
1
1/3

‘ఫేక్‌ వాట్సాప్‌ మెసేజ్‌లు నమ్మకండి’

‘ఫేక్‌ వాట్సాప్‌ మెసేజ్‌లు నమ్మకండి’
2
2/3

‘ఫేక్‌ వాట్సాప్‌ మెసేజ్‌లు నమ్మకండి’

‘ఫేక్‌ వాట్సాప్‌ మెసేజ్‌లు నమ్మకండి’
3
3/3

‘ఫేక్‌ వాట్సాప్‌ మెసేజ్‌లు నమ్మకండి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement