నేడే తుది విడత పోరు
మూడు మండలాల్లో అభ్యర్థులు, ఓటర్ల వివరాలు..
ములుగు: జిల్లాలో మూడో విడత పంచాయతీ పోరు బుధవారం జరగనుంది. జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో తుది విడత పోలింగ్‌కు అధికారులు సన్నద్ధమయ్యారు. ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయగా, తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది తరలివెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుండగా మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. తొలుత వార్డుల వారీగా ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించి గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను అందించనున్నారు. అలాగే ఎన్నికై న వార్డు సభ్యులలో మెజార్టీ సభ్యులు ఉపసర్పంచ్‌ను ఎన్నుకోనున్నారు.
మూడు మండలాల పరిధిలో 46 గ్రామ పంచాయతీలు ఉండగా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. మూడు మండలాల్లో 408 వార్డులకు 78 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 45 గ్రామపంచాయతీలకు 157 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 329 వార్డు స్థానాలకు 866 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కన్నాయిగూడెం మండలంలో 9,992 మంది ఓటర్లు, వెంకటాపురం(కె) మండలంలో 25,336 మంది ఓటర్లు, వాజేడు మండలంలో 19,431 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం మూడు మండలాల పరిధిలో 330 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా సుమారు 500 మందితో ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు.
జిల్లాలో మూడు మండలాలకు 922 మంది ీపీఓ (ప్రిసైడింగ్ అధికారులు), ఏపీఓలను (అసిస్టెంట్ ప్రిసైడింగ్‌అధికారులు) కేటాయించారు. వెంకటాపురం(కె) మండలంలో 200 మంది పీఓలు, 229 మంది ఏపీఓలు, వాజేడులో 152 మంది పీఓలు, 177 మంది ఏపీఓలు, కన్నాయిగూడెం లో 84 మంది పీఓలు, 80మంది ఏపీఓలు విధులు నిర్వర్తించనున్నారు. మొత్తం 436 మంది పీఓలు, 486 మంది ఏపీఓలు విధుల్లో పాల్గొననున్నారు.
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
45 జీపీలు.. 157 మంది అభ్యర్థుల పోటీ
329 వార్డు స్థానాలకు బరిలో
866 మంది
922 పీఓ, ఏపీఓల నియామకం
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు ఓటర్లు
వెంకటాపురం(కె) 18 62 150 381 25,336
వాజేడు 17 52 118 352 19,431
కన్నాయిగూడెం 10 43 61 133 9,992
పోలింగ్‌కు సర్వం సిద్ధం
కలెక్టర్ టీఎస్.దివాకర
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ టీఎస్. దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు వెంకటాపురం, వాజేడు , కన్నాయిగూడెం మండలాల్లో 45 సర్పంచ్ స్థానాలకు, 329 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కన్నాయిగూడెం మండలంలో ఒక వార్డుకు ఎలాంటి నామినేషన్ దాఖలు కాలేదని వెల్లడించారు. శాంతి భద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
నేడే తుది విడత పోరు
నేడే తుది విడత పోరు


