కాళేశ్వరంలో సాధువుల బస
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సాధువులు బస చేశారు. గోదావరి పరిక్రమణ(ప్రదక్షిణ)యాత్రలో భాగంగా యానాం నుంచి ఆదివారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వ్రిందావన్ పీఠాఽనికి చెందిన మలూక్‌పీత్ శ్రీరాజేంద్రదాస్‌జీ మహారాజ్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు సుమారుగా 500 వరకు స్థానిక దేవస్థానం 86 గదులు, ఇతర వసతి రూముల్లో రాత్రి బస చేశారు. అంతకు ముందు ఆ బృందంలోని ఓ శిశ్యుని గృహంలో అల్పాహారం తీసుకున్నారు. సోమవారం(నేడు) ఉదయం ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయనున్నారు. తరువాత శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి అభిషేక పూజలు చేస్తారు. వారికోసం కొంత మంది ముఖ్యులకు పూర్ణకుంభస్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో రాత్రిపూట దేవస్థానం వద్ద సాధువులతో పాటు వారి వాహనాలతో సందడి నెలకొంది.


