82.93 శాతం పోలింగ్
ములుగు రూరల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశా యి. మూడు మండలాల పరిధిలో మొత్తం 82.93 శాతం పోలింగ్ నమోదు అయింది. ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల వేళ ఎలాంటి ఘటనలకు తావులేకుండా ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టచర్యలు చేపట్టారు. ములుగు మండలంలోని జంగాలపల్లి, మల్లంపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌లు సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు
రెండోవిడత పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛయుత వా తావరణలో నిర్వహించారు. మల్లంపల్లి మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పంచా యతీ అధికారులు ఆదర్శ పోలింగ్ కేంద్రంగా ముస్తాబు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది విధులు నిర్వహించారు. వైద్యాఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహించారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సిబ్బంది వీల్‌చైర్‌లు ఏర్పాటు చేసి వారిని కేంద్రాలకు తరలించారు. మల్లంపల్లి పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులుతీరారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అన్ని శాఖల సమన్వయంతో..
ములుగు: జిల్లాలో రెండో విడత ఎన్నికలు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీఎస్ దివాకర తెలిపారు. రెండో విడతలో వెంకటాపురం, ములుగు, మల్లంపల్లి మండలాల్లోని 37 సర్పంచ్, 315 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. మూడు మండలాల్లో 82.93 శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. మండలాల వారీగా ములుగులో 78.81, మల్లంపల్లి 84.50, వెంకటాపురం(ఎం) 82.51 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 54,944 ఓట్లు ఉండగా, 45,565 మంది తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ప్రజలు ఎన్నికల సంఘం నియమాలు పాటిస్తూ జిల్లా యంత్రంగానికి స హకరించారని, 17న జరగనున్న మూడో విడత ఎన్నికలకు కూడా సహకరించాలని కోరారు.
మండలాల వారీగా ఓటింగ్ శాతం
ములుగు78.81
వెంకటాపురం(ఎం) 82.51
మల్లంపల్లి84.50
ప్రశాంతంగా రెండో విడత ఎన్నికలు
ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం)లో ఎన్నికలు
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్
82.93 శాతం పోలింగ్
82.93 శాతం పోలింగ్
82.93 శాతం పోలింగ్
82.93 శాతం పోలింగ్
82.93 శాతం పోలింగ్


