హస్తం జోరు
పార్టీల వారీగా గెలుపొందిన స్థానాలు
03
ఇతరులు
కాంగ్రెస్ బీఆర్‌ఎస్
02
01
21
0
10
13
07
06
05
04
21 స్థానాల్లో కాంగ్రెస్, 13 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం
మొత్తం
మల్లంపల్లి
ములుగు
● జిల్లాలో విజయోత్సవ సంబురాలు
● నేటితో ముగియనున్న మూడో విడత ప్రచారం
ములుగు రూరల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో హస్తం జోరు కొనసాగుతోంది. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా రెండో విడతలోనూ అత్యధిక స్థానాలు కై వసం చేసుకుంది. ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. మూడు మండలాల్లో మొత్తం 52 సర్పంచ్, 462 వార్డు స్థానాలు ఉండగా ఇందులో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. 37 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మూడు మండలాల్లో 54,944 మంది ఓటర్లకు గాను 45,565 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ములుగు 13, మల్లంపల్లి 6, వెంకటాపురం(ఎం) మండలంలో 18 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ములుగు మండలంలో 7 స్థానాలు కాంగ్రెస్, 5 స్థానాలు బీఆర్‌ఎస్, 01 ఇండిపెండెంట్, మల్లంపల్లిలో 4 స్థానాలు కాంగ్రెస్, 2 స్థానాలు బీఆర్‌ఎస్, వెంకటాపురం(ఎం)లో 15 స్థానాలు కాంగ్రెస్, 6 స్థానాలు బీఆర్‌ఎస్, 2 ఇతరులు గెలుపొందారు.
హస్తం జోరు
హస్తం జోరు
హస్తం జోరు


