హేమాచల క్షేత్రంలో..
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రం వందలాది మంది భక్త జనంతో ఆదివారం కిటకిటలాడింది. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి పట్టణాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పవన్‌కుమార్ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిల తైలాభిశేకం పూజలను జరిపించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి కై ంకర్యాదులు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు నిత్యఅన్నప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ తమవంతు ఆర్థిక సాయాన్ని అందించారు.
లక్ష్మీనర్సింహాస్వామి దర్శించుకుంటున్న భక్తులు


