పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత
ములుగు రూరల్ : జిల్లాలో మొదటి విడత పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు జిల్లాలో గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో మొదటి విడత ఎన్నికల నిర్వహణకు డీఎస్పీలు ఇద్దరు, సీఐలు ఆరుగురు, ఎస్సైలు 33 మందితో పాటు 400 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు భద్రత చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కంట్రోల్ రూం, క్విక్ రెస్పాన్స్ టీంలు, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పోలీస్ పికెటింగ్, మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు గుంపులుగా తిరగడం, బెదిరింపులకు పాల్పడకూడదని వెల్లడించారు.


