21న జాతీయ లోక్ అదాలత్
ములుగు: ఈ నెల 21న ములుగు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎస్‌వీపీ సూర్య చంద్రకళ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, ఇన్సూరెన్స్, ఎకై ్సజ్, ప్రీ–లిటిగేషన్ కేసులతో పాటు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లోక్ అదాలత్‌కు కక్షిదారులు హాజరై, తమ కేసులను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. రాజీపడదగు కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి రాజీ కుదుర్చుకోవాలని కోరారు. రాజీపడద గు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టు కు నేరుగా హాజరు కావాలని వెల్లడించారు.
ములుగు రూరల్: మేడారం జాతరలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీని తన కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జాతరలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్‌ను భక్తులకు అప్పగించడం అభినందనీయమని వివరించారు. ఈ ఏడాది జరిగే జాతరలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మూడు కేంద్రాల్లో భక్తులకు మినరల్ వాటర్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీనివాస్, సెక్రటరీ చుంచు రమేష్, కొట్టె రాజిరెడ్డి, సారయ్య తదితరులు పాల్గొన్నారు.
కాటారం: కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన క్రీడాకారులు రాంచరణ్, దేవేందర్, అభిషేక్ 69వ ఎస్‌జీఎఫ్ అండర్ 19 హ్యాండ్ బాల్ జిల్లాస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చారు. దీంతో నిర్వాహకులు వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ మాధవి బుధవారం తెలిపారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, బలరాం, మహేందర్, శ్రీనివాస్, వెంకటేశ్ అభినందించారు.
భూపాలపల్లి అర్బన్: భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను తెలుసుకొని వినియోగించుకోవాలని జిల్లా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల విద్యార్థులకు సూచించారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్జి అఖిల హజరై మాట్లాడుతూ.. యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనకు ఉందని ఎందరో మహనీయుల కృషి ఫలితంగా మానవ హక్కుల, విధుల రూపకల్పన జరిగిందన్నారు. ఎక్కడైతే హక్కులకు భంగం వాటిల్లుతుందో అక్కడ చట్టం న్యాయం పనిచేయడం ప్రారంభిస్తుందని తెలిపారు. జీవించే హక్కు సమానత్వ హక్కుతోపాటు విద్యాహక్కు కూడా ఉందని అన్నారు. చదువుతోనే ఏదైనా సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ పుప్పాల శ్రీనివాస్, పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు సేవానాయక్, న్యాయవాది మంగళపల్లి రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
21న జాతీయ లోక్ అదాలత్
21న జాతీయ లోక్ అదాలత్


