కాజీపేట టు పెంబర్తి.. | - | Sakshi
Sakshi News home page

కాజీపేట టు పెంబర్తి..

Dec 13 2025 7:52 AM | Updated on Dec 13 2025 7:52 AM

కాజీప

కాజీపేట టు పెంబర్తి..

ఇక్కడి నుంచి తరలించొద్దు..

ససేమిరా అంటున్న

విద్యార్థినుల తల్లిదండ్రులు

బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల షిఫ్టింగ్‌కు ఆదేశాలు

విద్యారణ్యపురి : మూడేళ్లక్రితం మహబూబాబాద్‌, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేశారు. వివిధ డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించగా అప్పట్లో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో కాలేదు. దీంతో ఆ తర్వాత మహబూబాబాద్‌, ములుగులోని ఆ రెండు బీసీ మహిళా డిగ్రీ కళాశాలలను అదే పేర్లతోనే కాజీపేటలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ ఐదేళ్ల ‘లా’కోర్సు నడుస్తున్న భవనంలోనికి షిఫ్టింగ్‌ చేశారు. రెండేళ్ల నుంచి ఆ భవనంలోనే అరకొర సౌకర్యాలతోనే ఆయా డిగ్రీ కళాశాలలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఐదు కోర్సుల్లోనే అడ్మిషన్లు అయ్యాయి. బీఏ, బీకాం సీఏ, ఎంపీసీఎస్‌, ఎంఎస్‌డీఎస్‌, బీఎస్సీ బీజెడ్‌సీ కోర్సుల్లో సుమారు 230మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఫస్టియర్‌, సెకండియర్‌ కోర్సులు కొనసాగుతుండగా వచ్చే సంవత్సరం ఫైనలియర్‌ విద్యార్థినులు కూడా ఉంటారు. పది మంది రెగ్యులర్‌ లెక్చరర్లు ఉండగా ఆరుగురు గెస్ట్‌ ఫ్యాకల్టీ విద్యాబోధన చేస్తున్నారు. స్పెషల్‌ ఆఫీసర్‌గా వి శ్రాంత అధ్యాపకుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇటీవల ‘లా’విద్యార్థినుల ఆందోళన

ఒకే భవనంలో ఐదేళ్ల ‘లా’కోర్సులో మూడు సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థినులు చదువుతున్నారు. ఈభవనంలోనే డిగ్రీ కళాశాల విద్యార్థినులు కూడా ఉండడంతో తమకు కూడా సదుపాయాలు సరిపోవడం లేదని ‘లా’విద్యార్థినులు ఇటీవల ఆందోళనకు దిగారు. డిగ్రీ కళాశాలల వేరే చోట నిర్వహించుకోవాలని ఆందోళన చేపట్టారు.

డిగ్రీ కళాశాలను పెంబర్తికి

షిఫ్ట్‌ చేయాలని ఆదేశాలు

‘లా’కళాశాల భవనంలోనే కొనసాగుతున్న బీసీ మహిళా డిగ్రీ కళాశాలల (మహబూబాబాద్‌, ములుగు)ల్లోని విద్యార్థినులను జనగామ జిల్లా పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న మహాత్మాజ్యోతిబాపూలే బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు షిష్టింగ్‌ చేయాలని (ఈనెల 20వతేదీవరకు) బీసీ గురుకులాల వెల్ఫేర్‌ రాష్ట్ర కార్యదర్శి సైదులు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఇందుకు సంబంఽధించిన ఉత్తర్వులు ఉమ్మడి వరంగల్‌ బీసీ గురుకులాల ఆర్‌సీఓకు, మహబూబాబాద్‌, ములు గు డిగ్రీ కళాశాలల కలిపి నిర్వహిస్తున్న డిగ్రీ కళా శాల స్పెషల్‌ ఆఫీసర్‌కు అందాయి. దీంతో కొన్నినెలలుగా ఈ కళాశాలకు వివిధ చోట్ల అద్దెభవనం చూశారు.కానీ అనువైన భవనం లభించడం లేదంటున్నారు. ఇప్పుడు కళాశాలలోని విద్యార్థినులను పెంబర్తి కళాశాలకు తరలించాలని యోచిస్తున్నారు.

కాజీపేటలో కొనసాగుతున్న బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను ఇక్కడే కొనసాగించాలి. పెంబర్తికి తరలించొద్దు. నా కూతురు కూడా డిగ్రీ చదువుతోంది. విద్యకుదూరమయ్యే పరిస్థితి తీసుకురావొద్దు. ములుగు జిల్లా గురుకుల డిగ్రీ కాలేజీని ములుగు జిల్లాలోనైనా ఏర్పాటు చేయాలి.

– కె.రాజు, ఓ విద్యార్థిని తండ్రి,

ములుగు జిల్లా దేవగిరి పట్నం

ఈ కళాశాల మహబూబాబాద్‌, ములుగు జిల్లాలకు సంబంధించినది కావడంతో ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థినులు కూడా కాజీపేటలోని ఈ కాలేజీలో చదువుకుంటున్నారు. తాము పట్టణ ప్రాంతంలో ఉందని ప్రవేశాలు పొందామని, ఇప్పుడు మళ్లీ తమను పెంబర్తి మహిళా గురుకుల కళాశాలకు తరలిస్తే దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్లబోమని స్పెషల్‌ ఆఫీసర్‌ ,అధ్యాపకులతోనూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈవిషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇటీవల కొందరు కాజీపేటకు వచ్చి ఇక్కడి నుంచి తరలించొద్దని స్పెషల్‌ ఆఫీసర్‌కు విన్నవించుకున్నారు. పలువురు తల్లిదండ్రులు బీసీ గురుకులాల ఉమ్మడి వరంగల్‌ ఆర్‌సీఓతోనూ మాట్లాడారని సమాచారం. ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌డీసీ రాష్ట్ర సెక్రటరీ ఆదేశాల మేరకు పెంబర్తిలోని బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు తరలించాలనే యోచనలో ఉన్నారు.

వ్యతిరేకిస్తున్న విద్యార్థినులు, తల్లిదండ్రులు

మహబూబాబాద్‌, ములుగు జిల్లాలకు కలిపి కాజీపేటలో ఏర్పాటు

మరోసారి తరలింపునకు ఆదేశాలు జారీ

కాజీపేట టు పెంబర్తి..1
1/1

కాజీపేట టు పెంబర్తి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement