హేమాచలుడిని దర్శించుకున్న హిమాలయ యోగి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిస్టతను ఆర్చకులు వివరించి వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత మన సనాతన ధర్మం అన్నారు. హేమాచలుడిని దర్శించుకున్న ఆయన మల్లూరు కేసీఆర్ కాలనీలోని మంచర్ల మనేశ్వర్‌రావు, యశోద పిరమిడ్ ధ్యాన మాస్టర్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహర్షి సంకల్పంతో కర్నూలులో ప్రారంభమైన ఒక పిరమిడ్ నేడు దేశ వ్యాప్తంగా లక్షల పిరమిడ్‌లు వెలిశాయన్నారు. సంకల్పంతో ధ్యానం చేసి శక్తిని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన మాస్టర్లు ఉప్పలి రమేశ్, కవిత, ముత్తినేని వెంకటేశ్వర్లు, యరంకని ఆనందం, ఉమ గ్రామస్తులు పాల్గొన్నారు.


