ప్రలోభాల ఎర
రెండో విడతపై.. తొలి విడత ఫలితాల ప్రభావం పడేనా..
తొలి విడత
సర్పంచ్‌లు వీరే..
మందు.. మాంసం
– వివరాలు
8లోu
ఓటర్లను ఆకట్టుకునేందుకు పాట్లు
● రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
● మూడు మండలాల్లో 52 జీపీలకు 15 ఏకగ్రీవం
● 37 సర్పంచ్ స్థానాలకు 129 మంది అభ్యర్థుల పోటీ
● 315 వార్డు స్థానాలు.. బరిలో 851 మంది
ములుగు: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామగ్రిని శనివారం అధికారులకు పంపిణీ చేయనున్నారు. ఉన్నతాధికారులు మండలాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు ర్యాండమైజేషన్‌ను పూర్తి చేశారు. శుక్రవారంతో ఎన్నికల ప్రచారానికి తెర పడడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
మొదటి విడతలో గోవిందరావుపేట, ఎస్‌ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లోని కాంగ్రెస్ 36 సర్పంచ్ స్థానాలను గెలుపొంది పైచేయి సాధించింది. బీఆర్‌ఎస్ 11 స్థానాలతో సరిపెట్టుకుంది. రెండో విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లోని 52 గ్రామ పంచాయతీలకు 15 ఏకగ్రీవం కాగా మిగిలిన 37 సర్పంచ్ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి.
37 సర్పంచ్, 315 వార్డులు
జిల్లాలోని ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల పరిధిలో 52 గ్రామ పంచాయతీలకు, 462 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, 15 గ్రామ పంచాయతీలు 147 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 37 సర్పంచ్ స్థానాలకు 129 మంది సర్పంచ్ అభ్యర్థులు, 315 వార్డు స్థానాలకు 851 మంది వార్డు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆదివారం జరగనున్న ఎన్నికల కోసం 462 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేయగా 66,729 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
1,183 అధికారులు కేటాయింపు
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు 1,183 మంది పీవో, ఏపీవోలను కేటాయించారు. మల్లంపల్లి మండలానికి 78 మంది పీవోలు, 93 మంది ఏపీవోలు, ములుగు మండలానికి 207 మంది పీవోలు, 263 ఏపీవోలు, వెంకటాపురం మండలానికి 245 మంది పీవోలు, 297 మంది ఏపీవోలు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఎన్నికలు ముగిసే వరకు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించనున్నారు.
రెండో విడత పోలింగ్‌పై.. తొలి విడత ఎన్నికల ఫలితాల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాలో అఽత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా బీఆర్‌ఎస్ అభ్యర్థులు వెనుకబడిపోయారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఎవరూ ఊహించని విధంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు సతీమణి శ్రీలతను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని విజయఢంకా మోగించారు.
రెండో విడతలో ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఈ క్రమంలో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మందు, మాంసం, నగదు రూపేణా ఆశపెడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమకే ఓటేసి గెలిపించాలంటూ ప్రాధేయపడుతున్నారు. డబ్బు, మందం పంపిణీకి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ప్రలోభాల ఎర


