‘హ్యూమన్‌ పాపిలోమా’పై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

‘హ్యూమన్‌ పాపిలోమా’పై శిక్షణ

Dec 10 2025 9:42 AM | Updated on Dec 10 2025 9:42 AM

‘హ్యూమన్‌ పాపిలోమా’పై శిక్షణ

‘హ్యూమన్‌ పాపిలోమా’పై శిక్షణ

‘హ్యూమన్‌ పాపిలోమా’పై శిక్షణ

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌పై వైద్యాధికారులకు, సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ తరగతులను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు హాజరై మాట్లాడారు. మహిళల్లో గర్భాశయ కేన్సర్‌ నిరోధించడానికి నూతనంగా కేంద్ర ప్రభుత్వం హ్యుమన్‌ వ్యాక్సిన్‌ ప్రవేశ పెట్టిందని అన్నారు. ఈ వ్యాక్సిన్‌ 14 ఏళ్లు నిండిన బాలికలకు వేయనున్నట్లు తెలిపారు. దీంతో ఎటువంటి దుష్పలితాలు ఉండవని వివరించారు. ఈ వ్యాక్సిన్‌ పై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్‌, ఎస్‌ఓ స్వరూపరాణి, మానిటరింగ్‌ సూపర్‌వైజర్‌ సురేశ్‌ బాబు, వెంకట్‌రెడ్డి, ఫార్మసీ స్టోర్‌ ఇన్‌చార్జ్‌ వినోద్‌, డీఈఓ నిఖిల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement