పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ములుగు: జీపీ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని అధికారులు నిశితంగా పరిశీలించాలని సాధారణ ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను జరిపేందుకు వీలుగా నియమించిన మైక్రో అబ్జర్వర్లకు శనివారం కలెక్టరేట్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌కు ముందురోజే డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ జయ ప్రకాశ్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.


