మూడో విడత నామినేషన్లు
వెంకటాపురం(కె): మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం తొలిరోజు కొనసాగింది. జిల్లాలోని వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ చేపట్టగా పలువురు సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. మూడో విడతలో భాగంగా బుధవారం వెంకటాపురం(కె)లో 18 సర్పంచ్ స్థానాలకు గాను అభ్యర్థులు తొలిరోజు నామినేషన్లు ఎవరూ వేయలేదు. వార్డు స్థానాలు 166 ఉండగా నలుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. వాజేడులో 17 సర్పంచ్ స్థానాలకు ఐదుగురు నామినేషన్లు వేయగా 152 వార్డు స్థానాలకు 14మంది నామినేషన్లు వేశారు. అలాగే కన్నాయిగూడెంలో 11 సర్పంచ్ స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా 90 వార్డు స్థానాలకు నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు.
మూడో విడత నామినేషన్లు


