
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్‌గా ఉందని జర్మనీకి చెందిన డానియల్, వోలివా, సారియా కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని వారు శనివారం సందర్శించి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ బాగుందని కొనియాడారు. అదేవిధంగా ఇంగ్లండ్‌కు చెందిన జొనాతన్ డేవిస్ సందర్శించగా రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ ఆయనకు వివరించారు.
రామప్పలో మాజీ డీజీపీ రాముడు..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ జేవీ రాముడు శనివారం సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా పూజారి హరీశ్ శర్మ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక ఎస్సై చల్లా రాజు ఉన్నారు.

రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్