
కరకట్టకు శాశ్వత పరిష్కారం చూపించాలి
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ప్రజలు గోదావరి వరదల వల్ల అభద్రతా భావంతో జీవిస్తున్నారని, గోదావరి కరకట్టకు శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం, ఏటూరునాగారం గ్రామంలో గతంలో నిర్మించిన కరకట్ట కోతకు గురికావడంతో ఆ ప్రాంతాలను బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి లక్ష్మీనర్సింహారావు బుధవారం పరిశీలించారు. 25 ఏళ్ల కింద నిర్మించిన కరకట్ట గండ్లుపడి కొట్టుకుపోయే దుస్థితికి చేరిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కరకట్టకు రివిట్‌మెంట్ చేయించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కరకట్టను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే జియో ట్యూబ్ టెక్నాలజీతో కొంత పనులు చేయిస్తామని చెబుతున్నారని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి కోతలకు గురైన కరకట్టను పరిశీలించి వెంటనే మరమ్మతు పనులు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్‌కుమార్, తుమ్మ మల్లారెడ్డి, కాకులమర్రి ప్రదీప్‌రావు, ఖాజాపాషా, తాడూరి రఘు, ధన్నపునేని కిరణ్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
లక్ష్మీనర్సింహారావు