
ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు ఇసుక
ఏటూరునాగారం: జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు ఇసుకను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 6 మండలాల్లో 11 ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేస్తూ డీఎల్‌ఎస్‌సీ తీర్మాణం చేస్తూ అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక వాహనం అనే పేరుతో కొత్తగా యాప్‌ను రూపొందించి పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇంటి యజమానుల డిమాండ్ మేరకు బుక్ చేయాల్సి ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న ట్రాక్టర్ ఇసుకను నేరుగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి చేరేవిధంగా పథకాన్ని రూపొందించారు.
క్యూబిక్ మీటర్‌కు రూ.100
ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.100లకు ఇసుకను ఇందిరమ్మ లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇసుక తోడి డంప్‌యార్డులో పోసేందుకు రేజింగ్ కాంట్రాక్టర్ కోసం గిరిజన సొసైటీలకు అప్పగించారు. డంపుయార్డు వద్ద నుంచి ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న లబ్ధిదారుడికి టీఎస్‌ఎండీసీ వారు సరఫరా చేస్తారు. ఇందు కోసం ఇటీవల జిల్లాలో పెసా గ్రామ సభలను సైతం ఏర్పాటు చేసి వారికి ప్రజల ఆమోదంతో తీర్మాణం చేయగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఒక్కో క్యూబిక్ మీటర్ చొప్పున ఒక ఇందిరమ్మ ఇంటికి 30 క్యూబిక్ మీటర్లను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంటి నిర్మాణంపై పంచాయతీ కార్యదర్శి ఇచ్చే సర్టిఫైడ్‌తో మరింత క్వాంటిటీ పెరిగే అవకాశాలున్నాయి.
క్యూబిక్ మీటర్‌కు రూ.100
ఇసుక తరలింపునకు డీఎల్‌ఎస్‌సీ
అనుమతి
6 మండలాల్లో 11 ఇసుక రీచ్‌లు