
రైతులను ప్రోత్సహించాలి
ములుగు రూరల్: ఆయిల్‌పామ్ సాగుకు రైతులను అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆయిల్‌పామ్ సాగు లాభసాటిగా ఉంటుందన్నారు. జిల్లాలో 2025–26 సాగు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. పంటల మార్పిడి, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు విరివిగా సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుకు అందిస్తున్న సబ్సిడీలను వివరించాలన్నారు. మండలాల వారీగా ఏఈఓలు 5 ఎకరాలకు పైబడి సాగు చేసే రైతుల వివరాలు, బోరు సౌకర్యం కలిగిన రైతులను గుర్తించి ఆయిల్ పామ్‌కు ప్రోత్సహించాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 వేల ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసే విధంగా టార్గెట్లను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు, వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
నానో యూరియాతో సత్ఫలితాలు
నానో యూరియా వినియోగంతో రైతులు సత్ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు జేడీ మల్లంపల్లి మండలం రాంచంద్రాపురంలో వ్యవసాయశాఖ, ఇప్కో వారి ఆధ్వర్యంలో రైతులకు డ్రోన్ సహాయంతో ఎరువుల వినియోగం, మందుల పిచికారీపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నానో సాంకేతికత పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులు నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సురేష్‌కుమార్, ఇప్కో డీఎం విశాల్ షిండే, స్నేహ ఎఫ్‌పీఓసీఈఓ చాంద్‌పాషా, డైరెక్టర్లు అశోక్, ప్రమేలా, కవిత, ఎంపీడీఓ హనుమంత్‌రావు, టీజీవీబీ మేనేజర్, మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్, నల్లెల్ల శ్రీధర్, ఏఈఓ కావ్య పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర