ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని వ్యాపార సముదాయాల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ సంపత్ అన్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో మటన్, చికెన్, చేపల విక్రయ ప్రదేశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణదారులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని సూచించారు. మాంసం, చికెన్, చేపలను పరిశుభ్రమైన వాతావరణంలో అమ్మకాలు చేపట్టాలన్నారు. నిబందనలు పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
మున్సిపల్ కమిషనర్ సంపత్