
సేంద్రియం వైపు అడుగులు..
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025
రసాయన ఎరువుల నియంత్రణే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
ములుగు రూరల్: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎన్‌ఎఫ్(నేషనల్ బిషన్ అన్ నాచ్యురల్ ఫార్మింగ్) పథకాన్ని అమలు చేస్తోంది. రసాయన ఎరువుల వినియోగంతో పంట పొలాలు నిర్జీవంగా మారుతున్న కారణంగా ప్రకృతి, మానవాళికి కలిగే నష్టాలను వివరిస్తూ రైతులను సేంద్రియ సాగు వైపు దృష్టి మళ్లించేందుకు కేంద్రం నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. రైతులు పంటల సాగులో అధికంగా రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం రోజు రోజుకూ దెబ్బతింటోంది. రసాయనాలతో సాగు చేసిన పంటలను తినడం మూలంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జిల్లాలోని మండలాల వారీగా గ్రామాలను ఎంపిక చేసుకొని ఒక్కో రైతు ఎకరం భూమి 125 మంది రైతులు సేంద్రియ సాగుకు సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో 15 క్లస్టర్లు
జిల్లాలోని పది మండలాల్లో కలిపి మొత్తం 15 క్లస్టర్‌లను ఎంపిక చేశారు. ఎంపికై న గ్రామంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల నుంచి 125 మంది రైతులను ఎంపిక చేసి ఒక్కో రైతుకు సంబంధించిన ఎకరం భూమిలో సేంద్రియ విధానంలో సాగు చేపట్టనున్నారు. ఎంపికై న రైతుల భూములకు భూసార పరీక్షలు నిర్వహించి ఏ రకం పంటలు సాగు చేయాలనే విషయం తెలియజేస్తారు. సాగు చేసిన పంటలకు మొదటి విడతలో పంటకు సరిపడా వేప పిండి, నూనె ఉచితంగా అందిస్తారు. సేంద్రియ విధానంలో పండించిన పంటలకు మార్కెట్‌లో ఉండే డిమాండ్‌ను వివరించి రైతులను చైతన్య పరుస్తారు. జిల్లాలో సేంద్రియ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను ప్రోత్సహించేందుకు వెలుగు రేఖ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భూసార పరీక్షల ఆధారంగా సాగు
సేంద్రియ సాగు కోసం ఎంపిక చేసిన గ్రామాలలో రైతుల పొలాల నుంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలను సేకరించారు. దీంతో పాటు సేంద్రియ సాగు పంటలకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గత రెండు నెలల క్రితం గ్రామాల ఎంపిక కావడంతో భూసార పరీక్షలకు మట్టి సేకరణ పూర్తి చేసి ల్యాబ్‌కు పంపించారు. దేశం మొత్తం సేంద్రియ సాగు ఒకేసారి అమలు చేయడం సాధ్యం కాదని భావించి గ్రామాలలో రైతులను ఎంపిక చేసుకొని సేంద్రియ సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు. రసాయక ఎరువుల వాడకం, కలుషిత ఆహార నియంత్రణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
మట్టి నమూనాలు సేకరిస్తున్న
వ్యవసాయ అధికారులు
న్యూస్‌రీల్
సేంద్రియ సాగుకు ఎంపికై న గ్రామాల వివరాలు
మండలం గ్రామాలు
ములుగు జగ్గన్నపేట,
అంకన్నగూడెం,
కన్నాయిగూడెం
వెంకటాపురం(ఎం) తిమ్మాపురం,
పాలంపేట
గోవిందరావుపేట ముత్తాపూర్,
రంగాపురం
ఎస్‌ఎస్ తాడ్వాయి పంబాపూర్
ఏటూరునాగారం ఏటూరునాగారం
మంగపేట నిమ్మగూడెం,
నర్సాయిగూడెం
కన్నాయిగూడెం సర్వాయి
వెంకటాపురం(కె) రాచపల్లి
వాజేడు అరుణాచలపురం
జిల్లాలో 15 క్లస్టర్ల ఎంపిక
ఒక్కో క్లస్టర్‌లో 125 ఎకరాలు.. 125 మంది రైతులు
భూసార పరీక్షల నమూనా సేకరణ పూర్తి
ప్రకృతి సాగుకు డిమాండ్ ఎక్కువ
రైతులు ప్రకృతి సాగు పద్ధతిలో పండించిన పంటలకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంటుంది. రసాయన ఎరువుల వాడకం నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం ప్రవేశపెట్టింది. ఎంపికై న గ్రామాలలో రైతుల భూముల నుంచి మట్టి నమూనాలను సేకరించాం. భూమి స్వభావాన్ని బట్టి పంటల సాగును చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. సేంద్రియ సాగుతో పండించిన పంటలు ఆరోగ్యవంతగా ఉంటాయి. జిల్లాలో వెలుగు రేఖ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ వారు పథకం అమలు తీరును పరిశీలస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందిస్తారు. రానున్న రోజుల్లో సేంద్రియ పంటల సాగు పెరిగే అవకాశం ఉంది.
– సురేశ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి