ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

Jul 18 2025 1:23 PM | Updated on Jul 18 2025 1:23 PM

ప్రభు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

బాసర ట్రిపుల్‌ ఐటీకి ముగ్గురి ఎంపిక

ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకంటే దీటైన ఫలితాలు సాధిస్తూ అబ్బుర పరుస్తున్నారు. ఉచిత నిర్బంధ విద్యతో పాటు అర్హులైన అనుభవం ఉన్న ఉపాధ్యాయులు చేసే బోధన పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పూర్తిచేసిన ముగ్గురు విద్యార్థులు బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించారు.

డీసీఎం డ్రైవర్‌ కుమార్తె..

మండల కేంద్రానికి చెందిన ఎండీ జాస్మిన్‌ పదోతరగతి పరీక్షల్లో 544 మార్కులు సాధించింది. తాజాగా విడుదలైన ట్రిపుల్‌ ఐటీ ఫలితాల్లో సీటు సాధించింది. విద్యార్థిని తండ్రి ఎండీ మొహిన్‌ డీసీఎం డ్రైవర్‌ కాగా తల్లి పర్విన్‌న్‌ గృహిణి. పట్టుదలతో చదవడంతో జాస్మిన్‌ ట్రిపుల్‌ ఐటీకి ఎంపికై ంది.

హ్యాండ్‌బాల్‌ క్రీడాకారిణి

మండల కేంద్రంలోని 5వ వార్డులో నివాసం ఉంటున్న జాడి రాధిక టెన్త్‌లో 557 మార్కులు సాధించింది. ఇటీవల మంత్రి సీతక్క నుంచి అవార్డు తీసుకుంది. రాధిక తండ్రి రాజు ఆటో డ్రైవర్‌ కాగా, తల్లి కూలీ పనులకు వెళ్తుంది. అంతేకాకుండా రాధిక హ్యాండ్‌బాల్‌ క్రీడాకారిణి.. పట్టుదలతో చదివి టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించింది. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందని రాజు తెలిపారు.

చాయ్‌వాలా కొడుకు..

మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డులో టీ స్టాల్‌ నడుపుతున్న రామరాజేందర్‌–అరుణల కుమారుడు రామ హర్షిత్‌ టెన్త్‌లో 559 మార్కులు సాధించాడు. హర్షిత్‌ తండ్రి టీ కొట్టు నడుపుకుంటూ పిల్లలను చదివిస్తున్నాడు. తండ్రి కష్టాన్ని తగ్గట్టుగా కొడుకు టెన్త్‌లో కష్టపడి మంచిమార్కులు సాధించి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు రావడంతో వారికి కొండంత అండ దొరికినట్లు అయ్యిందని, తన కుమారుడు ఉన్నత స్థాయికి చేరుతాడని రాజేందర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ1
1/2

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ2
2/2

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement