● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు రూరల్: మహిళా సంఘాల నుంచి రుణాలు పొందిన సభ్యులు సక్రమంగా రుణాలు చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని కలెక్టర్ టీఎస్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4,409 సంఘాలకు రూ.3.26కోట్ల వడ్డీ రాయితీ పొందారని పేర్కొన్నారు. 2024 నుంచి 2025 వరకు 5,233 సంఘాల సభ్యులు రూ.8.97కోట్ల రాయితీ పొందినట్లు వివరించారు. ఫిబ్రవరి 2025 మార్చి నెలలో 5,308 సంఘాలకు ప్రభుత్వం రూ.1.91 కోట్ల రాయితీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 10.88కోట్ల వడ్డీ రాయితీ వచ్చినట్లు వివరించారు.
వైద్యులు ఉత్తమ సేవలు
అందించాలి
ములుగురూరల్: ములుగు ఏరియా వైద్యశాలలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండి రోగులకు ఉత్తమ వైద్య సేవలను అందించాలని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ కోరారు. ఈ మేరకు మంగళవారం ములుగు ఏరియా వైద్యశాల బాధ్యతలను నూతనంగా చేపట్టిన చంద్రశేఖర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని ప్రజలకు వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, తిరుపతి, జయకర్, జక్కుల రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టులకు
వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని తోగుగూడెంలో మావోయిస్టు ఆత్మపరిరక్షణ ప్రజాఫ్రంట్ తెలంగాణ పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం వాల్‌పోస్టర్లు వెలిశాయి. అడవిని, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రండి.. మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని వాల్ పోస్టర్లలో పేర్కొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు వెలువడంతో చర్చనీయాంశంగా మారింది.
చెల్పాకకు బస్సు
సౌకర్యం కల్పించాలి
ఏటూరునాగారం: మండల పరిధిలోని చెల్పాక గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్‌ఐ) జిల్లా ఉపాధ్యక్షుడు కర్నె లాజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. మండల కేంద్రం నుంచి బస్సు చెల్పాక వరకు రవాణా సౌకర్యం కల్పిస్తే విద్యార్థులు, రైతులకు ఉపయోగంగా ఉంటుందని కోరారు.
కస్తూర్బాగాంధీ
పాఠశాల తనిఖీ
ములుగు రూరల్: మండల పరిధిలోని మదనపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలను మంగళవారం గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తాచెదారం లేకుండా చూడాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, జయకర్, జక్కుల రేవంత్, రమణాకర్ తదితరులు పాల్గొన్నారు.
రుణాలు చెల్లించి వడ్డీ రాయితీ పొందాలి
రుణాలు చెల్లించి వడ్డీ రాయితీ పొందాలి