బొగత జలపాతం సందర్శన
వాజేడు/వెంకటాపురం(కె): మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ ఐఅండ్‌బీ జాయింట్ సెక్రెటరీ ప్రీథుల్ కుమార్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆయన వెంట వాజేడు తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ కుమారస్వామి అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.అదే విధంగా వెంకటాపురం(కె) మండల పరిధిలోని పాలెంవాగు ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు స్థితిగతులతో పాటు నీటి సామర్ధ్యం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాల్వల స్థితిగతులపై ఆరా తీశారు. వీఆర్‌కేపురంలోని మిషన్ భగీరథ తాగునీటి వసతిని పరిశీలించారు. అక్కడ నుంచి వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో మొక్క నాటారు. ఆయన వెంట గ్రౌండ్ వాటర్ సైన్‌టిస్ట్ కిరణ్, సిడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్ చరణ్ ఉన్నారు.


