భాగ్యరెడ్డి వర్మ సేవలు మరువలేనివి..
ములుగు: దళితుల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం భాగ్యరెడ్డి వర్మ అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ టీఎస్.దివాకర, ఎస్పీ శబరీశ్ అన్నారు. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన సంఘ సంస్కర్త, ఆది ఆంధ్రసభ వ్యవస్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ అధికారి లక్ష్మణ్‌నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ దివాకర ముఖ్య అతిథిగా హాజరై భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శబరీశ్ ముఖ్యఅతిథిగా హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి నివాళులర్పించి భాగ్యరెడ్డి వర్మ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, కలెక్టరేట్ ఏఓ రాజ్‌కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్‌ఐలు స్వామి, సంతోష్, వెంకటనారాయణ, ఎస్సై జగదీశ్, ఆర్‌ఎస్సై సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
భాగ్యరెడ్డి వర్మ సేవలు మరువలేనివి..


