'వ్యూహం' విడుదల తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ | Sakshi
Sakshi News home page

'వ్యూహం' విడుదల తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

Published Fri, Feb 9 2024 10:11 AM

Vyooham Movie Makers Announced Official Release Date - Sakshi

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. తాజాగా సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్‌ బోర్డు  క్లియెరెన్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమా విడుదలపై డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తన ఎక్స్‌ పేజీలో ఒక పోస్ట్‌ చేశారు.

(ఇదీ చదవండి: Lal SalaamTwitter Review: 'లాల్‌ సలాం' ట్విటర్‌ రివ్యూ)

వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తాను సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 23న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. 

వాస్తవానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. వ్యూహం సినిమాపై మరొకసారి ఒక కమిటీ సమీక్షించి సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇవ్వడంతో విడుదలకు ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఫిబ్రవరి 23న వ్యూహం సినిమా విడుదల కానుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement