Ari Movie: ఆసక్తి పెంచుతోన్న వినోద్‌ వర్మ ఫస్ట్‌ లుక్‌! | Sakshi
Sakshi News home page

Ari Movie: ఆసక్తి పెంచుతోన్న వినోద్‌ వర్మ ఫస్ట్‌ లుక్‌!

Published Wed, Feb 28 2024 10:20 AM

Vinod Varma First Look Out From Ari Movie - Sakshi

‘పేపర్‌ బాయ్‌’ఫేం జయశంకర్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అరి’.'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. 

‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేశారు. ఓ పెద్ద లైబ్రరీలో ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది.

ఈ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ‘అరి’ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు.

 
Advertisement
 
Advertisement