మరో విభిన్నమైన పాత్రలో విక్రమ్.. మేకప్‌కే 4 గంటలు!

ఎంచుకునే పాత్రల్లో వైవిధ్యం చూపించ డానికి హీరో విక్రమ్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. సరికొత్త పాత్రలను చాలెంజ్‌గా తీసుకుని ఎంతో కష్టపడుతుంటారు. ‘శివపుత్రుడు’, ‘ఐ’, ‘కోబ్రా’ వంటి సినిమాల్లో విక్రమ్ చేసిన పాత్రలే ఇందుకు ఉదాహరణ. కాగా ప్రేక్షకులను మరోసారి అబ్బురపరిచేందుకు విక్రమ్ మరో సవాల్‌లాంటి ΄ాత్ర చేస్తున్నారు. విక్రమ్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది.
పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాత్ర కోసం విక్రమ ప్రోస్థటిక్ మేకప్ వేసుకుంటున్నారు. ఈ మేకప్‌కి నాలుగు గంటలు పడుతోందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. తదుపరి షెడ్యూ ల్‌ను కర్ణాటకలో ప్లాన్ చేశారు. పార్వతీ మీనన్, మాళవికా మోహనన్, పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.