ఆకతాయిల నుంచి హీరోయిన్‌ను కాపాడిన స్టార్‌ హీరో ఫ్యాన్స్‌ | Vijay Thalapathy Fans Protect Actress Neema Ray In Tamil Nadu, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆకతాయిల నుంచి హీరోయిన్‌ను కాపాడిన స్టార్‌ హీరో ఫ్యాన్స్‌

Sep 9 2025 7:15 AM | Updated on Sep 9 2025 10:51 AM

Vijay thalapathy fans Protect To Actress Neema Ray

ఒక్కో సారి చిత్ర యూనిట్‌కు కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాన్నే కన్నడ నటి 'నీమా రే'  ఎదుర్కున్నారు. తమిళ్‌లో మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్రన్‌ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇరవిన్‌ విళిగళ్‌..  ఈ చిత్రాన్ని సిక్కల్‌ రాజేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో  మహేంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా.. 'నీమా రే' హరోయిన్‌గా నటిస్తుంది. ఈమె కన్నడ చిత్రం బింగారాలో నటనకు జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్‌, కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమెకు మంచి పాపులారిటీనే ఉంది. దీంతో ఆమె ఎక్కడికి వెళ్లిన అభిమానులు భారీగానే చేరిపోతారు.

అయితే, తను నటిస్టున్న కొత్త చిత్రం సామాజిక మాధ్యమాల నేపథ్యంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రానుంది. ఈ మూవీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను తమిళనాడులోని వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన కొందరు యువకులు హద్దు మీరి హీరోయిన్‌ 'నీమా రే'  చేయి పట్టుకుని లాగుతూ గొడవ చేశారన్నారు. తాము ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదన్నారు. 

అప్పుడు అక్కడకు వచ్చిన నటుడు విజయ్‌ దళపతి అభిమానులు కొందరు కల్పించుకుని షూటింగ్‌కు కోసం తెచ్చిన కొరడాతో వారిని తరిమి తరిమి కొట్టారని  దర్శకుడు చెప్పారు. ఈ సంఘటనతో నటి 'నిమా రే' చాలా భయపడిపోయారని చెప్పారు. ఇరవిన్‌ విళిగల్‌ చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యిందనీ,త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.  నటి నీమా రే.. వైద్య విద్యను పూర్తి చేశారు. ఆపై ఎయిర్ హోస్టెస్ కోర్స్ కూడా పూర్తి చేశారు. ఆమె తమిళం, కన్నడ, తులు భాషల చిత్రాలలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement