Vijay Devarakonda Interesting Comments On Samantha - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: సమంతను ఫస్ట్‌ టైం చూసినప్పుడే ప్రేమలో పడ్డా..

Oct 27 2022 7:06 PM | Updated on Oct 27 2022 8:40 PM

Vijay Devarakonda Interesting Comments On Samantha - Sakshi

సమంతను మొట్టమొదటిసారి చూసినప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయాను. ఇప్పటికీ నేను ఆమెను ఆరాధిస్తున్నాను'

సమంత ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్‌ మూవీ యశోద. హరి, హరీశ్‌ సంయుక్తంగా డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ నవంబర్‌ 11న విడుదల కానుంది. తాజాగా యశోద ట్రైలర్‌ను తమిళంలో సూర్య, హిందీలో వరుణ్‌ ధావన్‌, కన్నడలో రక్షిత్‌ శెట్టి, మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌, తెలుగులో విజయ్‌ దేవరకొండ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా రౌడీ హీరో సామ్‌ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.

'కాలేజీలో చదువుకునే రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా వెండితెర మీద చూసి అభిమానిగా మారిపోయాను. అప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయాను. ఇప్పటికీ నేను ఆమెను ఆరాధిస్తున్నాను' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. అలాగే యశోద చిత్రయూనిట్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో సమంత అద్దె గర్భానికి సిద్ధపడిన మహిళగా చూపించారు. కథ అంతా సరోసగీ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ట్రైలర్‌ను మీరు చూసేయండి..

చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement