నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా! | Vijay Antony Latest Movie Raththam Movie Streaming On Amazon Prime | Sakshi
Sakshi News home page

Raththam Movie: ఓటీటీకి వచ్చేస్తోన్న రత్తం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Tue, Oct 31 2023 9:03 PM | Last Updated on Tue, Oct 31 2023 9:12 PM

Vijay Antony Latest Movie Raththam Movie Streaming On Amazon Prime - Sakshi

బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ ఏడాది బిచ్చగాడు-2 (పిచ్చైక్కారన్‌ 2) చిత్రంతో మరో హిట్ అందుకున్నారు.  వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటిస్తోన్న నటుడు విజయ్‌ తాజాగా నటించిన చిత్రం రత్తం. ఇన్‌ఫినిటీ ఫిలింస్‌ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రానికి సీఎస్‌ అముదాన్‌ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 3వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రం విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోని సరసన నటి మహిమా నంబియార్‌, నందితా శ్వేత, రమ్యానంబీశన్‌ ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషం.ఈ చిత్రానికి కన్నన్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement