Vignesh Shivan Removes AK 62 From His Twitter Bio - Sakshi
Sakshi News home page

Vignesh Shivan: ట్విటర్‌ బయో నుంచి ఆ పేరుని తొలగించిన నయనతార భర్త.. నెటిజన్స్‌ షాక్‌!

Feb 4 2023 5:57 PM | Updated on Feb 4 2023 7:15 PM

Vignesh Shivan removes AK 62 From His Twitter Bio - Sakshi

నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ చేసిన ఒక పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎందుకు అలా చేశాడు? ఇక ఆ జోడీ  కుదరనట్టేనా అని నెటిజన్స్‌ చర్చిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాతువాకుల రెండు కాదల్‌ చిత్రం తర్వాత కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌తో విఘ్నేష్‌ ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అజిత్‌ కెరీర్‌లో ఇది 62వ సినిమా(AK62). ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈసినిమా కోసం అజిత్‌ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో విఘ్నేష్‌ చేసిన ఓ పని పలు అనుమానాలకు తావిస్తోంది. విఘ్నేష్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగినట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అన్నట్లుగా.. విఘ్నేష్‌ తన ట్విటర్‌ బయో  నుంచి AK 62 అనే పేరును గొలగించాడు. దీంతో నిజంగానే  ఆ సినిమా నుంచి విఘ్నేష్‌ తప్పుకున్నాడా? ఇక ఈ కాంబోలో సినిమా రాదా? అని నెటిజన్స్‌ చర్చించుకుంటున్నారు. అయితే నిర్మాణ సంస్థ మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడం గమనార్హం.

కాగా లైకా ప్రొడక్షన్స్‌ మాత్రం పక్కా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హీరోయిన్‌ని కూడా సెలెక్ట్‌ చేశారట. ఈ చిత్రంలో అజిత్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని, అందులో నటి ఐశ్వర్యరాయ్‌ ఒకరు కాగా, రెండో హీరోయిన్‌గా నటి కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement