
తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. రీసెంట్ టైంలో ఇతడి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. అలా ఈ నెల తొలివారంలో విడుదలైన మూవీ 'విడామయూర్చి'. తెలుగులో దీన్ని పట్టుదల పేరుతో రిలీజ్ చేశారు. ఇప్పుడు దీని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది.
ఫిబ్రవరి 6న తెలుగు-తమిళంలో రిలీజైన ఈ చిత్రానికి తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ ఓకే అనుకున్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ లేకపోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ కలెక్షన్స్ రూ.100 కోట్లకు పైనే వచ్చాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)
ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్.. నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. మార్చి 3 అంటే వచ్చే సోమవారం నుంచే ఇది ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు ప్రకటించారు.
సినిమా కథ విషయానికొస్తే.. అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యాభర్తలు. అజర్‌బైజాన్‌లో ఉంటారు. మనస్పర్థల కారణంగా విడిపోదామని నిర్ణయం తీసుకుంటారు. విడిపోయే ముందు భార్యని.. చివరగా రోడ్ ట్రిప్ వేద్దామని అర్జున్ అడుగుతాడు. దీంతో ఆమె ఒప్పుకొంటుంది. ఆ ప్రయాణంలో ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)
Muyarchi thiruvinai aakum. Vidaamuyarchi ulagai vellum 💪🔥
Watch Vidaamuyarchi on Netflix, out 3 March in Tamil, Hindi, Telugu, Kannada & Malayalam!#VidaamuyarchiOnNetflix pic.twitter.com/21OiHpF8AB— Netflix India South (@Netflix_INSouth) February 24, 2025