హైదరాబాద్‌లో షూట్ గ్యాప్‌లో హ్యాపీగా మామిడిపండ్లు తింటున్నారు హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఏ సినిమా షూట్ అంటే ‘వారణాసి’. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘ఇట్స్ డ్యాన్సింగ్ టైమ్’ అన్నట్లు మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా పాల్గొంటుండగా భారీ స్థాయిలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి.
మహేశ్, ప్రియాంక అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నారని తెలిసింది. థియేటర్స్‌లో ప్రేక్షకులకు ఈ పాట ఓ విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందట. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేస్తున్నారని తెలిసింది. ఈ సాంగ్ షూట్ గ్యాప్‌లో మామిడి పండ్లు తింటున్నట్లుగా ప్రియాంకా చోప్రా తన ఇన్‌స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగానే విదేశాల్లో మరో కొత్త షెడ్యూల్‌ను ఆరంభించనున్నారట రాజమౌళి. ఎస్‌ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.


