హనీమూన్‌ ట్రిప్‌లో కొత్తజంట.. ఎవరో గుర్తుపట్టారా..? | Varalakshmi Sarathkumar Went To Honeymoon | Sakshi
Sakshi News home page

హనీమూన్‌ ట్రిప్‌లో కొత్తజంట.. ఎవరో గుర్తుపట్టారా..?

Jul 7 2024 6:58 AM | Updated on Jul 8 2024 9:12 AM

Varalakshmi Sarathkumar Went To Honeymoon

కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌, నికోలయ్‌ సచ్‌దేవ్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. థాయ్‌లాండ్‌ వేదికగా జులై 2న వీరి వివాహం ఘనంగా జరిగింది.  చెన్నైలో జరిగిన రిసెప్షన్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు.

కొన్నిరోజులుగా తమ పెళ్లికి రావాలంటూ చాలామంది ప్రముఖులను ఆహ్వానించే పనిలో  వరలక్ష్మీ బిజీగా గడిపేసింది. ఇలా కొద్ది రోజులుగా శుభలేఖలు పంచడం, హల్దీ, మెహీందీ, ఫ్రీ వెడ్డింగ్‌ పార్టీ, పెళ్లి, రిసెప్షన్‌, వివాహానరంతరం జరిగే విశేష కార్యక్రమాలతో ఊపిరాడనంత బిజీ బిజీగా గడిపిన నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ ఇప్పుడు భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లారు. అయితే, ఈ కొత్తజంట హనీమూన్‌కు ఏ దేశానికి వెళ్లారో మాత్రం చెప్పలేదు.

అందమైన ప్రదేశాల్లో వారు తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో వరలక్ష్మీ  పంచుకుంది. తుపాన్‌ తరువాత ప్రశాంతత అంటూ వారు ఆనందంగా ఉన్న ఫోటోలను ఆమె షేర్‌ చేసింది. ఇప్పుడు ఈ జంట హనీమూన్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement