తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడి ఎన్నిక

Vallabhaneni Anil kumar Telugu Film Workers Federation new President. - Sakshi

– అనిల్‌ కుమార్‌

తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 18 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి కొమర వెంకటేష్‌పై విజయం సాధించారు అనిల్‌ కుమార్‌. ప్రధాన కార్యదర్శిగా పీఎస్‌ఎన్‌ దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా రాజేశ్వర్‌ రెడ్డి ఎన్నికయ్యారు.

నూతన అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ – ‘‘దాసరిగారి ఆశయాలతో కార్మిక వర్గాన్ని సంక్షేమబాటలో తీసుకుని వెళతాం. సినీ కార్మికుల ఐక్యత కోసమే మేం పోరాడి గెలిచాం. కరోనా వల్ల ఇబ్బందులపాలైన కార్మికులను ఆదుకోవడంపై మొదట దృష్టి పెడతాం. చిరంజీవిగారు, భరద్వాజగారు, సి. కల్యాణ్‌ వంటి సినీ ప్రముఖులు, ఛాంబర్, నిర్మాతల మండలిల సహకారంతో సినీ కార్మికులను బతికించుకుంటాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top