
'ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు' అన్నది సినిమా డైలాగ్. ఎహె.. ఫ్లూటు ఊదడం కాదు, డైరెక్ట్‌గా వెళ్లి వాటితో ఆడుకుంటానంటోంది నటి వైగా రోజ్. థాయిల్యాండ్‌లో బ్యాంకాక్ ట్రిప్‌కు వెళ్లిన ఈ బ్యూటీ ఓ రెండు సింహాల దగ్గరకు వెళ్లి వాటిని నిమురుతూ సరదాగా ఆడుకుంది. సివంగిపై చేయి వేసి తను కూడా ఆడసింహంలా కెమెరాకు ఫోజిచ్చింది.
సింహాలతో ఆట
ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జైలర్‌కా హుకుం పాటను యాడ్ చేసింది. ఇది చూసిన అభిమానులు వీడియోలో మాకు మూడు సింహాలు కనిపిస్తున్నాయి, ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? సివంగిలా ఉన్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైగా రోస్.. అలెగ్జాండర్ ద గ్రేట్ మూవీతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆర్డినరీ, ఎన్ను నింటె మొయిదీన్ వంటి పలు చిత్రాల్లో నటించింది.
చదవండి: డేంజర్ జోన్‌లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?