తిరుచెందూర్ మురుగన్ (సుబ్రమణ్య స్వామి ఆలయం)ను నటుడు, టీవీకే అధినేత విజయ్ దర్శించుకున్నారు. కొద్దిరోజులుగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయ్ 4న విడుదల కానున్న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తిరుచెందూర్ మురుగన్‌ను విజయ్ దర్శించుకున్నారు. స్వామి ఆయుధం "వేల్" (శక్త్యాయుధము) చేత అందుకున్న విజయ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతారు. అందుకే స్వామి ఆశీస్సుల కోసం విజయ్ వచ్చినట్లు తెలుస్తోంది.

తమిళనాడులో ఉన్న మురుగన్ ఆరు నివాసాలలో ఇది రెండవది. తమిళనాడులో అత్యధికంగా సందర్శించే మతపరమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ఆలయం ఉంది. సుబ్రహ్మణేశ్వర స్వామికి చెందిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపైనే ఉన్నాయి. కానీ, తిరుచెందూర్ మాత్రం సముద్ర తీరంలో కొలువై ఉంటుంది. ఇక్కడి సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని భక్తులు చెబుతారు. తిరుచెందూర్ మురుగన్‌కు అభిషేకం చేసిన విభూతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే, గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవని నమ్ముతారు. తమిళనాడు నలుమూలల నుంచి తిరుచెందూర్‌కు చేరుకోవచ్చు. తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మధురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నిరంతరం రైలు, బస్సు రవాణా సౌకర్యం ఉంది.
#TVKVijay at Tiruchendur Murugan Temple for Vishwaroopa Darshan ❤️🔥💥pic.twitter.com/204nfbypKs
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) April 28, 2026


