హౌజ్‌ కీపర్‌గా, సేల్స్‌ గర్ల్‌గా చేశా: ప్రముఖ నటి పవిత్ర | Sakshi
Sakshi News home page

Tv Actress Pavitra Jayaram: పెద్దగా చదువు లేదు.. హౌజ్‌ కీపర్‌, సేల్స్‌ గర్ల్‌గా చేశా: ‘త్రినయని’ నటి

Published Mon, Apr 10 2023 9:32 AM

Tv Actress Pavithra Jayaram About Her Career and Struggles - Sakshi

నటి పవిత్ర జయరామ్‌.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు టీవీ సిరియల్స్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన ఆమె ప్రస్తుతం స్టార్‌ మాలోని త్రినయని సీరియల్లో అలరిస్తున్నారు. ఆమె ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. తాను పెద్దగా చదువుకోలేదని, ఇండస్ట్రీకి రావడానికి ముందు హౌజ్‌ కీపర్‌ పని చేశానంది.

‘‘మాది కర్ణాటకలోని మాండ్య. నేను పెద్దగా చదువుకోలేదు. కానీ నాకంటూ సొంత గుర్తింపు ఉండాలనే తపనతో బెంగళూరు వచ్చాను. అయితే నాకు పెద్దగా చదువు లేకపోవడంతో ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. దీంతో కొన్ని రోజులు హౌజ్‌ కీపర్‌గా పని చేశాను. ఆ తరువాత సెల్స్‌ గర్ల్‌గా, లైబ్రరీలో కూడా వర్క్‌ చేశాను. వచ్చే ఆదాయం సరిపోక ఆర్థిక ఇబ్బుందులు పడ్డాను. నా ఇబ్బందులను చూసి నా స్నేహితురాలు ఓ ఫిలిం మేకర్‌ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చింది. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సిరి గంధం శ్రీనివాసమూర్తిని కలిసి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరాను. ఆ సమయంలోనే కన్నడ సీరియల్స్‌లో చేయాలన్న ఆలోచన వచ్చింది.

పలు సీరియల్స్‌కి ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. చిన్న చిన్న రోల్స్ వస్తే చేశాను. జోకాలి అనే కన్నడ సీరియల్లో హీరోకి చెల్లెలి పాత్రతో సినీరంగ ప్రవేశం చేశాను. అక్కడ నుంచి తెలుగులో ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో అవకాశం వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ‘ఆ సమయంలో తనకు తెలుగు అస్సలు అర్ధమయ్యేది కాదని. ఆ సీరియల్లో నటించే వారంతా తెలుగులో మాట్లాడుతుంటే అర్థమయ్యేది కాదు. ఒకానొక సమయంలో సీరియల్స్ వదిలేసి వెళ్లిపోవాలి అనుకున్నా. అప్పుడు నా పరిస్థితిని అర్థం చేసుకున్న నా తోటి నటులు ధైర్యం చెప్పి.. తెలుగు చదవడం, రాయడం నేర్పించారు. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నా’ అని చెప్పింది.  

 
Advertisement
 
Advertisement