ప్రభాస్- దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ లేకుండానే ఇప్పటికే కల్కి పార్ట్-2 షూటింగ్ పనులు కొద్దిరోజుల క్రితమే మొదలయ్యాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్‌తో భాగమైన సీన్స్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. అయితే, తాజాగా ఈ మూవీలో మరో స్టార్ నటుడు చేరాడని తెలుస్తోంది.

హైదరాబాద్‌లో కొనసాగుతున్న కల్కి-2 షూటింగ్ సెట్స్‌లోకి ప్రముఖ హీరో జె.డి. చక్రవర్తి కూడా ఎంట్రీ ఇచ్చారని సమాచారం. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ మూవీలో ఆయన ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారట. అతి త్వరలోనే కల్కి సెట్స్‌లోకి ప్రభాస్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నగా.. దీపికా పదుకోన్ స్థానంలో ఒక కొత్త నటి రానుంది. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు.


