
టాలీవుడ్ హీరో శర్వానంద్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పటి వరకు హీరోగా అభిమానులను మెప్పించిన ఆయన.. నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. తన డ్రీమ్ను ఇవాళ నేరవేర్చుకున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఓఎంఐ అనే సంస్థను లాంఛ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
శర్వానంద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ..' ఈరోజు నా హృదయానికి దగ్గరైన కల.. ఓఎంఐకి నాంది పలికింది. ఈ దార్శనికతను ప్రారంభించినందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కృతజ్ఞతలు. ఓఎంఐ అనేది సృజనాత్మకత, స్థిరత్వం, మానవ సంబంధాన్ని పెంపొందించడానికి మొదలెట్టిన ఒక వాగ్దానం' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు
ఇక సినిమాల విషయానికొస్తే శర్వానంద్ భోగి చిత్రంలో నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ డింపుల్ హయతి లీడ్ రోల్ చేస్తున్నారు.
Today marks the beginning of a dream close to my heart, #OMI 🤍
I feel truly honored and grateful to the Former Vice President of India, Shri @MVenkaiahNaidu Garu, for launching this vision.
OMI is a promise to nurture creativity, sustainability, and human connection. pic.twitter.com/aoRjamGuMz— Sharwanand (@ImSharwanand) September 9, 2025