ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. మళ్లీ కనిపిస్తే బాగుండు! | Tollywood Hero Prabhas First Movie Heroine, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Prabhas First Movie Heroine: ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. 22 ఏళ్లయినా తగ్గేదేలే!

Mar 29 2024 11:11 AM | Updated on Mar 29 2024 11:50 AM

Tollywood Hero Prabhas First Movie Heroine Video Goes Viral - Sakshi

మంజుల-విజయ్‌ కుమార్‌ల వారసురాలిగా వెండితెరపై  మెరిసిన ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్‌కుమార్. బాలనటిగా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. తెలుగులో 2002లో ఈశ్వర్‌ మూవీతో పదిహేనేళ్ల వయసుకే హీరోయిన్‌గా నటించింది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్‌ లాంటి చిత్రాల్లోను కనిపించింది. ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఈ బ్యూటీ 2009లో రాహుల్‌ను పెళ్లాడాక సినిమాలు తగ్గించేసింది. 2011లో వీర అనే సినిమా చేసిన ఐదేళ్లకు చివరిసారిగా ఓ కన్నడ చిత్రంలో కనిపించింది. 

అయితే ప్రభాస్‌కు మొదటి సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవి ప్రస్తుతం టీవీ షోల్లో సందడి చేస్తోంది. అయితే ప్రభాస్‌కు జంటగా నటించిన ఈశ్వర్ చిత్రం 2002లో రిలీజైంది. ఈ మూవీ విడుదలై దాదాపు 22 ఏళ్లు అవుతోంది. అయితే ఈ సినిమా హిట్‌ కాకపోయినా.. వీరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వీరిద్దరిపై ఓ అభిమాని చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈశ్వర్ సినిమా రిలీజై 22 ఏళ్లు అవుతున్నా ఇద్దరు ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు.. రాబోయే ప్రభాస్ అన్నయ్య సినిమాల్లో ఏదో ఒక రోల్ చేస్తే బాగుండు అని రాసుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే శ్రీదేవి పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరంగా ఉంటోంది.  కానీ పెళ్లయ్యాక సినిమాలు చేయొద్దని ఎవరూ అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. నా భర్త అయితే మూవీస్‌ చేయమని ప్రోత్సహించాడని వెల్లడించింది. ప్రస్తుతం టీవీ షోల్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది ముద్దుగుమ్మ. 

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement