ప్రియుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్.. వెడ్డింగ్ కార్డ్ లీక్! | Tollywood Actress Kriti Kharbanda Wedding invitation Leaked In Online, See Marriage Date Details Inside - Sakshi
Sakshi News home page

Actress Kriti Kharbanda Marriage Invitation: ప్రియుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్.. డేట్ ఫిక్స్!

Published Wed, Mar 6 2024 3:28 PM

Tollywood Actress Kriti Kharbanda Wedding invitation Leaked In Online - Sakshi

బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ కృతి కర్బందా. ఆ తర్వాత అలా మొదలైంది, తీన్‌మార్ చిఒంగోలు గిత్త, బ్రూస్‌లీ సినిమాలతో మెప్పించింది. అంతే కాకుండా బాలీవుడ్‌ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతంత సినిమాలకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ చివరిసారిగా 14 ఫేరే చిత్రంలో కనిపించింది. అయితే గతనెల లవర్స్ డే రోజున బాయ్‌ఫ్రెండ్ పుల్కిత్ సామ్రాట్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంది. తామిద్దరం కలిసి మార్చ్ చేయబోతున్నాం అంటూ తన పెళ్లి గురించి అభిమానులకు హింట్ ఇచ్చింది. దీంతో ఈ ఏడాది మార్చిలోనే ఈ జంట ఒక్కటి కాబోతుందని వార్తలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరు మార్చి 13న వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీక్‌ అయిన పెళ్లి పత్రిక నెట్టింట సందడి చేస్తోంది. వెడ్డింగ్ కార్డ్ చూస్తే ప్రముఖ బీచ్‌ వేదికగా వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే వివాహా వేడుక ఎక్కడ అనేది ఇంకా తెలియరాలేదు.  

కాగా.. ఇటీవల ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో వివాహం చేసుకున్నారు. దీంతో రకుల్‌ బాటలోనే వీరు కూడా గోవాలోనే ప్లాన్‌ చేశారా? అని అభిమానులు భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ జంట మార్చి 13న వీరి ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది.

కాగా..పుల్కిత్, కృతి వారి 2018 రొమాంటిక్ కామెడీ 'వీరే కి వెడ్డింగ్' సెట్స్‌లో కలుసుకున్నారు. అప్పటి నుంచే వీరిద్దరు డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత పగల్పంటి (2019), తైష్ (2020) సినిమాల్లో స్క్రీన్ కూడా పంచుకున్నారు. ఈ ఏడాది  జనవరిలో రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్‌తో ఈ జంట మార్చిలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 
 

Advertisement
Advertisement