పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే? | Telugu Serial Actor Akarsh Wedding And Wife Details | Sakshi
Sakshi News home page

Akarsh Byramudi: పెళ్లి చేసుకున్నాడు.. కానీ అది మాత్రం సస్పెన్స్

May 10 2024 12:21 PM | Updated on May 10 2024 12:28 PM

Telugu Serial Actor Akarsh Wedding And Wife Details

'మామగారు' సీరియల్ హీరో గంగాధర్ పెళ్లి చేసుకున్నాడు. అదేనండి సీరియల్ నటుడు ఆకర్ష బైరమూడి.. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేసేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని యూట్యూబర్ నిఖిల్ పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలువురు సీరియల్ యాక్టర్స్.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!)

కర్ణాటకలోని సక్లేష్‌పురలో పుట్టి పెరిగిన ఆకర్ష్.. కన్నడ, తెలుగు సీరియల్స్‌లో హీరోగా చేసి క్రేజ్ సంపాదించాడు. పున్నాగ, అత్తారింట్లో అక్క చెల్లెళ్లు, అగ్నిపరీక్ష, రాజేశ్వరి విలాస్ కాఫీ తదితర సీరియల్స్ ఇతడు చేసిన వాటిలో ఉన్నాయి. అలానే 'మామగారు' సీరియల్ కూడా ఇతడి చేస్తున్నాడు.

గత కొన్నిరోజుల నుంచి బ్యాచిలర్ పార్టీ, హల్దీ,  ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతూ వచ్చాయి. దీంతో ఆకర్ష్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడా అని అతడి అభిమానులు అనుకున్నారు. తాజాగా ఆకర్ష్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోని యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే అమ్మాయి ఎవరనేది మాత్రం సస్సెన్స్ గానే ఉంచేశాడు. 

(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement